వికారాబాద్ టౌన్, ఏప్రిల్ 7 (ఆంధ్రప్రభ) : వికారాబాద్ జిల్లాకేంద్రంలో మహిళ మృతిచెందిన సంఘటన చోటు చేసుకున్నది. వికారాబాద్ పోలీసులు సోమవారం తెలిపిన వివరాలు ప్రకారం… ఒక గుర్తు తెలియని మహిళ మున్సిపల్ ఆఫీసు, వికారాబాద్ దగ్గర చనిపోయి పడి ఉందని స్థానికులు తెలిపారు. సమాచారం మేరకు వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ గుర్తు తెలియని మహిళకు ఎడమ చెయ్యి లేదు.. ఆ మహిళ గురించి ఏమైనా సమాచారం తెలిస్తే వికారాబాద్ పోలీస్ స్టేషన్ సీఐ, ఈ ఫోన్ 8712670030 ,8712670031లకు వికారాబాద్ పోలీస్ స్టేషన్ కు సమాచారం తెలుపగలరని పోలీసులు పేర్కొన్నారు.
Vikarabad | గుర్తు తెలియని మహిళ మృతి..
