ఇద్దరు మావోయిస్టు అగ్రనేతల మృతి
చర్ల (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా), ఆంధ్రప్రభ : ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని ఈ రోజు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టుల అగ్రనేతలు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్(Encounter)ను బస్తర్ ప్రాంత ఐజీ సుందర్ రాజ్ ధ్రువీకరించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని అబుజ్‌మద్(Abujmad) ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం అందుకున్నభద్రతా దళాలు ఆపరేషన్ ప్రారంభించాయి. ఉదయం నుంచి భద్రతా దళాలు, మావోయిస్టుల(Maoists) మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డి మృతి చెందారని భద్రతా దళాలు గుర్తించాయి.
ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం
ఎదురుకాల్పులు జరిగిన ప్రదేశంలో భద్రతా దళాలు(Security Forces) విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సోదాల్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలతో పాటు, ఒక ఏకే-47 రైఫిల్( AK-47 Rifle), ఇతర ఆయుధాలు, భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు, మావోయిస్టు సాహిత్యం, ప్రచార సామాగ్రి, వారికి నిత్యావసర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.



