Transfer | ఉద్యోగులకు ఘన సన్మానం…

Transfer | ఉద్యోగులకు ఘన సన్మానం…

Transfer | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలో విద్యుత్తు లైన్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ఎండి గౌస్ మొహిద్దిన్, ఎంబడి లక్ష్మయ్యలు సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్‌గా పదోన్నతి పొంది బదిలీ(transfer)పై వెళుతున్న సందర్భంగా దండేపల్లి సెక్షన్ కార్యాలయంలో ఈ రోజు సిబ్బంది ఘనంగా వారిని సన్మానించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… వినియోగదారులకు మెరుగైన సేవలందించి వినియోగదారుల మన్ననలు పొందిన ఇరువురిని అభినందించారు. బదిలీ స్థానాలలో కూడా మెరుగైన సేవలందించి ఉన్నత స్థానాలకు ఎదగాలని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ రవీందర్(Inspector Ravinder), లైన్మెన్లు పూరెల్ల నాగన్న, నెల్కి మల్లేష్, వెంకటరెడ్డి కండే శ్రీధర్, ఏఎల్ఎంలు రవికుమార్, మహేందర్ రామ్మూర్తి, అంజి, మనోహర్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply