Tragic Incident | డ్యూటీకి ముందే…

Tragic Incident | డ్యూటీకి ముందే…

Tragic Incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నాగర్‌కర్నూల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జాతర బందోబస్తు డ్యూటీకి వెళ్లాల్సిన హోంగార్డు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ చెంచుగూడెానికి చెందిన భయన్న (45) అనే హోంగార్డు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. భయన్న కోడేరు పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. సలేశ్వరం జాతర బందోబస్తు విధులకు వెళ్లాల్సి ఉండగా, అచ్చంపేట ప్రాంతంలో అతడు పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply