Tragedy | భార్య, కుమారుడు మృతి.. కుమార్తె పరిస్థితి విషమం

Tragedy | భార్య, కుమారుడు మృతి.. కుమార్తె పరిస్థితి విషమం

Tragedy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మద్యం మత్తులో భార్య, పిల్లలను చంపిన సంఘటన ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆమనగల్లు మండలంలో కుటుంబ విషాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో భర్త చేసిన దాడిలో భార్య, కుమారుడు మృతి చెందగా, కుమార్తె ప్రాణాపాయ స్థితిలో ఉంది.

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం పులిగోని పల్లి తండాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బాణావత్ రామ్ దాస్ నాయక్ అనే వ్యక్తి మద్యం మైకంలో తన భార్య, పిల్లలపై దాడికి దిగాడు. ఈ ఘటనలో భార్య, కుమారుడు తీవ్ర గాయాలతో మృతి చెందగా, కుమార్తె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ జానకి రెడ్డి కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply