Tractor | పొలం దున్నుతుండగా….

Tractor | పొలం దున్నుతుండగా….
Tractor | మోత్కూరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని సదర్శాపురం గ్రామంలో ఈ రోజు మధ్యాహ్నం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం తుంగపాటి హన్మయ్య, అండమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు హైదరాబాద్(Hyderabad)లో ఉంటుండగా, చిన్న కొడుకు తుంగపాటి యాకరాజు (38) గ్రామంలోనే తల్లిదండ్రులతో పాటు ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు.

యాకరాజు స్థానిక బజ్జురి బావి సమీపంలో ఆకుల సైదులుకి చెందిన పొలం కౌలుకు చేస్తున్నాడు. ఆ పొలం దున్నే పనిలో ఉన్న సమయంలో ట్రాక్టర్(Tractor) దిగబడింది. దాన్ని బయటికి తీసే ప్రయత్నంలో ట్రాక్టర్ అదుపు తప్పి వెనక్కి తిరగబడటంతో అటు స్టీరింగ్, ఇటు కల్టివేటర్ మధ్యలో ఇరుక్కొని యాకరాజు అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
ఘటన సమాచారం అందుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని గుండెలు అవిసెలా విలపించారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ప్రమాదంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనపై పోలీస్ లు విచారణ ప్రారంభించారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించి ఆదుకోవాలని సర్పంచ్ మునుకుంట్ల నీలకంఠం కోరారు.
