వ్యవసాయ మోటర్లు, వైర్లు దొంగతనం..

వ్యవసాయ మోటర్లు, వైర్లు దొంగతనం..
రాత్రి సమయంలో పెట్రోలింగ్ పెంచాలంటున్న బీజేపీ నాయకులు….
కాజీపేట, ఆంధ్రప్రభ : సోమిడి లో గుర్తు తెలియని దుండగులు శుక్రవారం రాత్రి 10 మంది రైతుల వ్యవసాయ బావులకు చెందిన మోటర్లు, విద్యుత్ వైర్లు, ఇతర ఉపకరణాలను చోరీ చేశారు. ఈ సంఘటనతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.సమాచారం అందుకున్న పిఎసిఎస్ డైరెక్టర్ కాయిత రాజ్ కుమార్ యాదవ్, 62 బీజేపీ డివిజన్ అధ్యక్షుడు మేకల శ్రవణ్ బాధిత రైతుల బావులను స్థానికంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసు అధికారులు తక్షణమే కేసు నమోదు చేసి విచారణ చేపట్టి, దొంగలను పట్టుకొని చోరీ అయిన సొత్తును రికవరీ చేసి రైతులకు న్యాయం చేయాలని తెలిపారు. గతంలో ఒక రైతుకు చెందిన ట్రాక్టర్ టైర్లు చోరీ అయిన సంఘటనలో పోలీసులు సరైన దర్యాప్తు చేయకపోవడంతో బాధితుడికి న్యాయం జరగలేదని గుర్తుచేశారు. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం రాత్రి సమయంలో సోమిడి శివారు ప్రాంతంలో పెట్రోలింగ్ పెంచాలని, ఇలాంటి చోరీలను అరికట్టాలని తెలిపారు.
