Thieves | అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి..

Thieves | అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి..

Thieves | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నగరంలో చెడ్డి గ్యాంగ్ కార్యకలాపాలు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంటిలో అర్ధరాత్రి సమయంలో దొంగలు చొరబడిన ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇంటి యజమాని సునంద కుమార్ రెడ్డి అప్రమత్తంగా ఉండటంతో దొంగలు ఏమీ దోచుకోకుండా అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి.

బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అనుమానితుల కోసం గాలిస్తున్నారు. ఇటీవల చెడ్డి గ్యాంగ్ సంచారం పెరగడంతో స్థానిక ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు గస్తీని కట్టుదిట్టం చేసి భద్రత చర్యలను మరింత బలోపేతం చేస్తున్నారు.

Leave a Reply