గెలిపించే బాధ్యత మీది.. పల్లాతో అభివృద్ధి బాధ్యత మాది – బీఆర్ఎస్ అభ్యర్థి కదిరె రాజశేఖర్ రెడ్డి..

గెలిపించే బాధ్యత మీది.. పల్లాతో అభివృద్ధి బాధ్యత మాది – బీఆర్ఎస్ అభ్యర్థి కదిరె రాజశేఖర్ రెడ్డి..

జనగామ, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ 14 వ వార్డులో గెలిపించే బాధ్యత వార్డు ప్రజలదని, అభివృద్ధి చేసే బాధ్యత మాదని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కదిరే రాజశేఖర్ అన్నారు. సోమవారం ఇంటింటా ప్రచార పర్వంలో ముందంజలో కొనసాగుతున్నారు. తనకు ఒక్కసారి అవకాశం కల్పించి 14 వ వార్డు కౌన్సిలర్ గెలిపిస్తే వార్డులో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తానని ఓటర్లకు విన్నవిస్తున్నారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తను కౌన్సిలర్ గెలిస్తే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారంతో వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్య నిర్వహణ వీధి దీపాలు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, సీసీ రోడ్లు డ్రైనేజీ వసతి, తాగునీటి సౌకర్యంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తామని హామీ ఇస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.

ఇప్పటికే వార్డులో వందలాది మంది మహిళలతో నిత్యం ఇంటింటి ప్రచారం చేస్తూ ఓటర్లను ఆత్మీయంగా పలకరిస్తున్నారు. ఎక్కడ విన్నా కదిరె రాజశేఖర్ రెడ్డి గెలుపుపై జోరుగా చర్చలు వినిపిస్తున్నాయి. 14వ వార్డులో రాజశేఖర్ రెడ్డి కౌన్సిలర్ గా బీఆర్ఎస్ పార్టీ గెలుపు తధ్యమని, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో గాడిపల్లి ప్రేమలతారెడ్డి, మద్దికుంట రాధారెడ్డి, ముసిని రాజు గౌడ్, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply