తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న నీరా కేఫ్ ను కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్ కు అప్పగించింది. ఎక్సైజ్, పర్యాటక శాఖలతో సంప్రదించిన ప్రభుత్వం.. నీరా కేఫ్‌ను పర్యాటక శాఖ నుండి తెలంగాణ రాష్ట్ర కల్లు గీత పారిశ్రామిక సంస్థకు బదిలీ చేసింది.
అయితే, ఆ భూమి టూరిజం శాఖది కావడంతో నీరాకేఫ్ నుంచి వచ్చే ఆదాయంలో 30శాతం టూరిజంశాఖకు చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఈ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు సహకరించిన ఎమ్మెల్సీ, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు కల్లుగీత విభాగం అధ్యక్షులు నాగరాజు గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.