అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ తో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ దంచికొట్టింది. ముఖ్యంగా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గొప్ప ఆకాశమే హద్దుగా విజృంభించాడు. అయ్యార్ తో పాటు ప్రియాంష్ ఆర్య, శశాంక్ సింగ్ కూడా చెలరేగి ఆడారు. దీంతో నిర్ణీత ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.
కాగా, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టింది పంజాబ్. ఓపెనర్ ప్రియాంష్ ఆర్య (23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 47), కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ (42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో 97 నాటౌట్), శశాంక్ సింగ్ (16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 44 నాటౌట్) వైల్డ్ ఫైర్ బ్యాటింగ్ తో ఆహా అనిపించారు.
గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్ మూడు వికెట్లతో అందరి దృష్టిని ఆకర్షించగా.. రబాడ, రషీద్ ఖాన్ తలా ఒక వికెట్ తీశారు. ఇక 244 పరుగుల భారీ లక్ష్యంతో గుజరాత్ టైటన్స్ ఛేజింగ్ కు దిగనుంది.