TG CM | గృహనిర్బంధం వల్లే కేసీఆర్ రావడం లేదు…

TG CM | గృహనిర్బంధం వల్లే కేసీఆర్ రావడం లేదు…
TG CM | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ హయాంలో 6వేల ఫోన్లు ట్యాప్ చేశారని 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు కేటీఆర్, హరీశ్ రావు ఏ విచారణ కోరినా అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈ కేసులో ఒక ప్రాసెస్ ప్రకారమే ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని చెప్పారు. విచారణ జరగకుండా అరెస్టు చేయలేం కదా అన్నారు. ప్రభాకర్ రావు స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే అనుమతి ఇచ్చిందని ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇప్పటికే అరవింద్ కుమార్‍ను సస్పెండ్ చేశామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టు క్లిన్ చిట్ ఇచ్చిందని హరీశ్ రావు అసత్య ప్రచారం చేసుకుంటున్నారు. పంజాగుట్టలో ప్రైవేట్ కేసులో క్లీన్ చిట్ వచ్చిందన్నారు.
కేసీఆర్‌ను అల్లుడు, కుమారుడు కలిసి గృహనిర్బంధం చేశారని, అందువల్లే వల్లే ఆయన అసెంబ్లీకి రావడం లేదన్నారు. ఈ మధ్య పోలీసులపై కాల్పులు జరిగినా బీజేపీ నేతలు స్పందించలేదన్నారు. పోలీసులపై కాల్పులు జరిగితే బీజేపీ ఎందుకు స్పందించలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో డ్రగ్స్ దొరికినా బీజేపీ నేతలు మాట్లాడట్లేదన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి ఉన్నారనేందుకు ఇదే నిదర్శనమన్నారు. హిల్ట్ పాలసీ, టీడీఆర్ భూబదలాయింపుపై సవాల్ విసిరానన్నారు. ఏ ఏజెన్సీతోనైనా విచారణకు సిద్ధమని కేటీఆర్, హరీశ్‌కు సవాల్ చేశానన్నారు. హిల్ట్ పాలసీ వల్ల రూ.5 లక్షల కోట్ల అవినీతి జరిగిందనడం సరికాదన్నారు.
ఫోన్‌ట్యాపింగ్ విషయంలో చట్ట ప్రకారమే ముందుకెళ్తామన్నారు. చట్టప్రకారం వెళ్తేనే… రేపు కోర్టులో కేసు నిలుస్తోందన్నారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావు 20 నెలలు అందుబాటులో లేరన్నారు. ప్రభాకర్‌రావు అందుబాటులో లేకపోవడంతో 20నెలలు ఆలస్యమైందన్నారు.
ప్రభాకర్‌రావు అందుబాటులోకి వచ్చాక విచారణ కొనసాగుతోందన్నారు. సుప్రీంకోర్టులో ఫోన్‌ట్యాపింగ్ కేసు ఇంకా విచారణకే రాలేదన్నారు.
చక్రధర్‌గౌడ్ కేసు కొట్టేస్తే.. ఫోన్‌ట్యాపింగ్ కేసు కొట్టేసినట్లు ప్రచారం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
