బాధిత కుటుంబాలకు ఎస్ఆర్ఆర్ చేయూత

బాధిత కుటుంబాలకు ఎస్ఆర్ఆర్ చేయూత

ఫౌండేషన్ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, ఏప్రిల్ 6 (ఆంధ్రప్రభ): నిరుపేద బాధిత కుటుంబాలకు ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చేయూతనిస్తుందని ఫౌండేషన్ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మహబూబ్ నగర్ గ్రామంలో న్యూస్ రిపోర్టర్ బొమ్మేదేని కోటేశ్వర్ కుమారుడు సాయి చరణ్ మృతి చెందగా, మృతిని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం, ఆయిల్ క్యాన్ అందించారు. అనంతరం తెట్టేకుంట తండా గ్రామంలో బానోతు హరి ఇటీవల అనారోగ్యంతో చికిత్స తీసుకొని, ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటాండగా పరామర్శించి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం చేశారు. ఆయన వెంట రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్, మండల పార్టీ ముఖ్య నాయకులు లేతకుల రంగారెడ్డి, గాదె రవీందర్ రెడ్డి, తాళ్ల పెళ్లి సంతోష్ గౌడ్, ఐత రామ్ చందర్, లక్కం కుమార్, గూడ రాజు,గిరిక రాజిరెడ్డి,పెండ్లి సోమయ్య,చందు రాము,సంకినేని ఎల్ల స్వామి స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply