భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలపడమే బిజెపి లక్ష్యం..

భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలపడమే బిజెపి లక్ష్యం..

భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య
మక్తల్ లో ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మక్తల్ , ఆంధ్రప్రభ : భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలపడమే బిజెపి లక్ష్యమని మాజీ ఎంపీపీ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య అన్నారు.సోమవారం బిజెపి 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బిజెపి పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి.రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను రాష్ట్ర నాయకులు కొండయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ ఏకాత్మ మానవవాద సైద్ధాంతిక పునాదులపై ఏర్పడి దేశ నిర్మాణంలో సమర్పణ భావంతో అకుంఠిత దీక్షతో కృషి చేస్తున్న కార్యకర్తల బలమున్న పార్టీ బిజెపి అని అన్నారు. సమస్యల పరిష్కారానికి అలుపెరుగని పోరాటం చేస్తూ దేశానికి పూర్వ వైభవం తీసుకురావడమే బిజెపి లక్ష్యమని అన్నారు .

దేశంలో విదేశీయులు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ, విదేశీ కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే ఉన్న పరిస్థితుల్లో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయి,ఎల్ కె.అద్వానీ వంటి నేతల ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం అప్పటి పరిస్థితుల్లో జనతా పార్టీలో విలీనం చేయడం జరిగిందని దేశ భవిష్యత్తు కోసం భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలపడమే లక్ష్యంగా 1980 ఏప్రిల్ 6న బిజెపి పార్టీ ఆవిర్భావం జరిగిందన్నారు. అప్పటినుండి దేశ సంక్షేమం కోసం అనేక ఉద్యమాలను చేపడుతూ వచ్చిందన్నారు. ఒకానొక సమయంలో రెండు ఎంపీ స్థానాలు ఉన్న బిజెపి అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో 13 రోజుల ప్రభుత్వాన్ని ఆ తర్వాత మరోసారి 22 పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత బిజెపి దేనని అన్నారు.

ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో చరిత్రను తిరగ రాస్తూ 3వసారి సొంత మెజార్టీతో కేంద్రంలో అధికారం చేపట్టడం జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లోనూ కేంద్రంలోనే కాకుండా కుటుంబ పాలన అంతం చేస్తూ తెలంగాణ లో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని కొండయ్య ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు కెటాయిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చిల్లిగవ్వ ఇవ్వడం లేదని దుష్ప్రచారం చేయడం తగదని అన్నారు . రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం కోసం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి కార్యకర్త ప్రతిజ్ఞ తీసుకొని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు కర్ని స్వామి, జిల్లా నాయకులు దేవరెంటి నరసింహారెడ్డి, కురువ హనుమంతు, మున్సిపల్ కౌన్సిలర్లు పీకే .నరసింహ, టప్ప కృష్ణ ,బి.ఆంజనేయులు సూర్య, మల్లేష్ ,పట్టణ ప్రధాన కార్యదర్శులు లింగం, టప్ప అశోక్ మాజీ కౌన్సిలర్లు బుగ్గన, రేణుక నరసింహ, కావలి సత్యనారాయణ, పట్టణ నాయకులు గోపాల్ రెడ్డి, సత్యనారాయణ,విద్యాసాగర్, రాజశేఖర్, నగేష్ ,శివరాములు, మహదేవ్ , బీజేవైఎం జిల్లా నాయకులు మంజునాథ్, ఆంజనేయులు, నవీన్, శ్రీధర్, నాగరాజు, రాము, శ్రీనివాస్, కొండయ్య, ఆంజనేయులు హీరాలాల్ , చెన్నప్ప, ,అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply