ఎరువులను సొసైటీ పరిధిలోని రైతులకు అందజేయాలి

ఎరువులను సొసైటీ పరిధిలోని రైతులకు అందజేయాలి

రెంజల్, ఆంధ్రప్రభ : ఎరువులను సొసైటీ పరిధిలోని రైతాంగానికి మాత్రమే అందజేయాలని రైతులు కోరారు.సోమవారం మండలంలోని ధూపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో పిఐసి అశోక్ కుమార్ అధ్యక్షతన మహాజనసభ కొనసాగింది.జమ, ఖర్చుల వివరాలను రైతాంగానికి చదివి వినిపించడం జరిగింది.సొసైటీ పరిధిలోని ధూపల్లి,పోచారం,దండిగుట్ట,కళ్యాపూర్,కూనేపల్లి,బాగేపల్లి గ్రామాల రైతులకు విక్రయించాలని తీర్మానించారు.కొన్న స్థలంలో ప్రభుత్వ సలహాదారు,స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిధులతో భవనాన్ని నిర్మించాలని అన్నారు.దీర్ఘకాలిక అప్పులను రైతులు చెల్లించాలని,లేకపోతే చట్టపర చర్యలు తీసుకోవడంలో వెనకాడదే లేదని తీర్మానించారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నిర్వహణకు సిబ్బంది అన్ని సిద్ధం చేసుకోవాలని రైతులు అన్నారు.తాజా మాజీ చైర్మన్ భూమారెడ్డి,మాజీ సర్పంచ్ శనిగరం సాయిరెడ్డి,విడిసి అధ్యక్షుడు సిహెచ్ బాబన్న,మాజీ ఎంపీటీసీ లింగన్న యాదవ్,ధనుర్ గంగాధర్,సాయిలు,గంగారెడ్డి,గోపాల్ రెడ్డి,రైతులు,సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply