ఉచిత వైద్య శిబిరం..

ఉచిత వైద్య శిబిరం..

రోగులను పరీక్షిస్తున్న దక్ష హాస్పిటల్ వైద్యులు

గట్టుప్పల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో దక్ష హాస్పిటల్ హయత్నగర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.శిబిరాన్ని సర్పంచ్ నామని జగన్నాథం ప్రారంభించి మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ శిబిరంలో జనరల్ ఫిజీషియన్ కావ్య,రఘురామ్,గైనిక్ హరిప్రియ మొత్తం 105 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.అవసరమైన వారికి రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఉచితంగా వైద్య సేవలు అందించి,మందులు పంపిణీ చేసిన హాస్పిటల్ వారికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఎండి నాగేష్, అడ్మినిస్ట్రేషన్ రామారావు, రాకేష్,హాస్పిటల్ వైద్య బృందం పాల్గొన్నారు.

Leave a Reply