పేద ముస్లింలకు కిట్ల పంపిణీ..

పేద ముస్లింలకు కిట్ల పంపిణీ..

నార్సింగి, ఆంధ్రప్రభ : పవిత్ర రంజాన్ మాసంలో మానవతా విలువలు మరింత ప్రతిబింబించాయి. నార్సింగి జామా మసీదులో ముస్లిం పెద్దల సమక్షంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు సందర్భంగా కాంగ్రెస్ నాయకులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి.సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశం గౌడ్ . ఉప సర్పంచ్ రాజేందర్ రెడ్డి,చేతుల మీదుగాపేద ముస్లిం కుటుంబాలకు అవసరమైన కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్వో గ్రేసీ బాయ్.తో పాటు రెవెన్యూ సిబ్బంది హాజరై సేవా కార్యక్రమాన్ని అభినందించారు. స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పేదల పట్ల చూపుతున్న శ్రద్ధ, సంక్షేమ పథకాలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమం సామాజిక ఐక్యతకు, ప్రభుత్వ సేవా దృక్పథానికి ప్రతీకగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ముస్లిం మత గురువు మోన్ సాబ్ పెద్దలు చాన్ ఖూరేష్. ఎండి బాకర్, ఎండి ముజీబ్ పాషా. ముర్తుజ. రబ్బాని. సాదక్. తదితరులు పాల్గొన్నారు

Leave a Reply