పనిచేసే వారికి పట్టం కట్టాలి

పనిచేసే వారికి పట్టం కట్టాలి

టిపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు
ఒకటో వార్డు అభ్యర్థి కుర్ర లింగయ్య తరపున విస్తృతంగా ప్రచారం చేసిన శ్రీను బాబు
హస్తం గుర్తుకు ఓటేసి ఆశీర్వదించండి

మంథని: మంథని మున్సిపల్ పరిధిలో ఒకటవ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుర్ర లింగయ్య పనిచేసే సత్తా ఉన్న వ్యక్తిని గెలిపించండి అని టిపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు ప్రచారంలో ప్రజలను కోరారు. కుర్ర లింగయ్య తరపున టిపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. శ్రీను బాబు ప్రచారానికి అడుగడుగున జనాలు బ్రహ్మరథం పట్టారు. శ్రీను బాబు ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకు వెళుతూ ఆధ్యాంతం ఆకట్టుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి, అభివృద్ధి మరింత చేసి చూపిస్తానని ఆయన తెలిపారు. ఒకటవ వార్డ్ ప్రజలు ఆశీర్వదించి హస్తం గుర్తుకు ఓటేయాలని, ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అభ్యర్థి లింగయ్య మాట్లాడుతూ… గెలిచిన తర్వాత పాలకుల వలె కాకుండా సేవకుల వలె పరిపాలన అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరికీ సమన్యాయం అందించడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి హస్తం గుర్తుకు ఓటెయ్యాలని కోరారు.

Leave a Reply