లైసెట్టి రజితను గెలిపించండి… అభివృద్ధికి నాదే బాధ్యత

లైసెట్టి రజితను గెలిపించండి… అభివృద్ధికి నాదే బాధ్యత
మంత్రి శ్రీధర్ బాబు
ఎనిమిదో వార్డ్ కాంగ్రెస్ హస్తం కావాలని పిలుపు
హస్తం గుర్తుకు ఓటేసి ఆశీర్వదించండి
మంథని: మంథని మున్సిపల్ పరిధిలో ఎనిమిదవ వార్డ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లైశేట్టి రజిత రాజు గెలిపించండి అభివృద్ధిని మీ ముందు ఉంచుతానని తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆమె తరపున మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. మంత్రి శ్రీధర్ బాబు ప్రచారానికి అడుగడుగున జనాలు బ్రహ్మరథం పట్టారు. మంత్రి శ్రీధర్ బాబు ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకు వెళుతూ ఆధ్యాంతం ఆకట్టుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి, అభివృద్ధి మరింత చేసి చూపిస్తానని ఆయన తెలిపారు. ఎనిమిదో వార్డ్ కాంగ్రెస్ హస్తం కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అభ్యర్థి రజిత రాజు మాట్లాడుతూ… గెలిచిన తర్వాత పాలకుల వలె కాకుండా సేవకుల వలె పరిపాలన అందజేస్తామని ఆమె పేర్కొన్నారు. ప్రజలందరికీ సమన్యాయం అందించడానికి కృషి చేస్తామని ఆమె తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని ఆమె వివరించారు. ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి హస్తం గుర్తుకు ఓటెయ్యాలని కోరారు.
