TG | ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డికి గ్రామస్తుల కృతజ్ఞతలు.

TG | ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డికి గ్రామస్తుల కృతజ్ఞతలు.

TG | మునుగోడు, (ఆంధ్రప్రభ): నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలో ఫిబ్రవరి 15న జరగనున్న శ్రీ శ్రీ పార్వతి రామలింగేశ్వరస్వామి జాతర (మహాశివరాత్రి) సందర్భంగా గ్రామానికి అవసరమైన వీధి దీపాల ఏర్పాటుకు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సహకారం అందించారు. కొంపల్లి గ్రామానికి 63 వీధి దీపాలను (స్ట్రీట్ లైట్స్) మంజూరు చేశారు. జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఆలయ కమిటీ చైర్మన్ వెదిరె విజేందర్ రెడ్డి వీధి దీపాల అవసరాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఆయన గ్రామాభివృద్ధికి మరో ముందడుగు వేశారు. దీని వల్ల రాత్రి వేళల్లో భక్తులకు, గ్రామస్తులకు సౌకర్యం కలుగుతుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు,కొంపల్లి గ్రామ సర్పంచ్ శ్రీమతి జీడిమడ్ల నిర్మలదశరథ, గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు గౌరవ ఎమ్మెల్యే కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సేవలు అభినందనీయమని వారు పేర్కొన్నారు.

Leave a Reply