TG | కెజీబీవీ ఎస్ఓ విమలకు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు

TG | కెజీబీవీ ఎస్ఓ విమలకు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు


TG | కడెం (నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లాలోని కడెం మండల కేంద్రంలోని కెజీబీవీ పాఠశాల ప్రత్యేక అధికారి (ఎస్ ఓ) కే విమలకు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు లభించింది. కడెం కేజీబీవీ పాఠశాల జూనియర్ కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం, పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో వందశాతం ఫలితాలు ఎన్ రోల్ మెంట్ ఇతర అకాడమిక్ విషయాలలో ప్రగతి సాధించినందుకు గాను తెలంగాణ విద్యాశాఖ రాష్ట్ర కార్యాలయం హైదరాబాదులో తెలంగాణ విద్యాశాఖ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ యోగితా రానా, తెలంగాణ విద్యాశాఖ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్, డైరెక్టర్ డాక్టర్ ఈ నవీన్, నికోలస్ లు, ఎస్ ఓ కె విమలకు శాలువలతో సత్కరించి రాష్ట్రస్థాయిలో ఉత్తమ పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జెడి వెంకట నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. తమకు రాష్ట్రస్థాయి పురస్కారం రావడానికి భాగమైనటువంటి నిర్మల్ జిల్లా అధికారులకు కేజీబీవీ కడం పాఠశాల జూనియర్ కళాశాల కడెం సిఆర్ టీలకు, పీజీసీఆర్టీలకు, నాన్ టీచింగ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు గ్రహీతఎస్ ఓ కె విమల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply