Temple | ప్రతిష్టాపన విగ్రహాల ఊరేగింపు..

Temple | ప్రతిష్టాపన విగ్రహాల ఊరేగింపు..

Temple | గాంధారి, ఆంధ్రప్రభ : గాంధారి మండలంలోని తిప్పారం తండాలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామాలయం(Sri Kodanda Rama Temple)లో ప్రతిష్టించనున్న విగ్రహాలను ఈ రోజు గాంధారి మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. తిప్పారం తండాలో దాదాపు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో శ్రీ కోదండ రామాలయాన్ని నిర్మించారు.

నూతనంగా నిర్మించిన ఆలయంలో ప్రతిష్టించనున్న సీతారాముల విగ్రహాలతో పాటు, లక్ష్మణుడు, ఆంజనేయుని( Lakshmana, Anjaneya) విగ్రహాలను తిరుపతి సమీపంలో తయారు చేయించి ప్రత్యేక వాహనంలో తీసుకువచ్చారు. తీసుకు వచ్చిన విగ్రహాలను తండా వాసులు గాంధారి మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా తిప్పారం తండా వరకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా తిప్పారం తండా(Tipparam Thanda) వాసులు కాషాయపు జెండాలు పట్టుకొని, జై శ్రీరామ్ అనే నినాదాలు చేస్తూ ఆలయంలో ప్రతిష్టించనున్న విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు.

ఊరేగింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, గాంధారి ఎస్సై ఆంజనేయులు పోలీస్ సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యుడు బాపూరావు మహారాజ్(Bapurao Maharaj), తండా మాజీ సర్పంచ్ బిషన్ నాయక్, తాన్ సింగ్ నాయక్, గంగారం, పెంటయ్య తో పాటు తండావాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply