Temple | శ్రీకోదండ రామాలయం, పంచవటి కాలనీ, మణికొండ

Temple | శ్రీకోదండ రామాలయం, పంచవటి కాలనీ, మణికొండ
Temple | మణికొండ, ఆంధ్రప్రభ : స్థానిక పంచవటి కాలనీలో కోలువైన శ్రీ కోదండ రామాలయంలో చాతుర్మాసం సందర్భంగా నెల రోజులుగా అత్యంత వైభవంగా తిరుప్పావై ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఈ రోజు భోగి పండుగ సందర్భంగా గోదా రంగనాయక స్వామి వార్ల కల్యాణం వేద పండితుల పర్యవేక్షణలో ఘనంగా జరిగింది.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ దిలీప్ స్వామి, జితేందర్ స్వామి, ఫణీంద్ర స్వామి చేతుల మీదుగా ఆలయ కమిటీ వారిచే. నిర్వహిస్తున్నకల్యాణ మహోత్సవంలో భక్తులు కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Kalyanam |ఆకట్టుకున్న చిన్నారుల అలంకరణ..
తిరుప్పావై(Thiruppavai) ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు నిర్వహించిన దోగాదేవి కల్యాణంలో చిన్నారి హర్షిక, ఫణి ఆదర్శ గోదాదేవిగా అలంకరించుకోవడం భక్తులందరిని ఆకర్షించింది. తిరుప్పావై ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి, అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేసారు. అన్ని పర్వదినాలకు దేవాలయంలో ఉత్సవాలు అత్యంత సంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తున్న కమిటీ వారిని స్థానిక కాలనీ వాసులు, భక్తులు అభినందించారు.




CLICK HERE TO READ MORE : Sri Ranganatha | జలాల్‌పూర్ గ్రామస్తుల కొంగు బంగారం
