Tekumatla | మానవత్వం చాటుకున్న గ్రామస్తులు..

Tekumatla | మానవత్వం చాటుకున్న గ్రామస్తులు..

  • నిరుపేద కుటుంబానికి అండగా…
  • మనుమరాలు పేరిట రూ.29 వేలు ఫిక్స్డ్ డిపాజిట్

Tekumatla | టేకుమట్ల, ఆంధ్రప్రభ : ఇంటి పెద్దను కోల్పోయిన బాధిత‌ కుటుంబానికి గ్రామస్తులు అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన చెక్క స్వరూప (65) ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. ఇతని కొడుకు, కోడలు, మనుమడు, మనవరాలు ఉన్నారు.

నిరుపేద కుటుంబం కావడంతో గ్రామస్తులంతా కలిసి తమకు తోచిన సాయం అందించడమే కాకుండా 29వేల 8 వందల రూపాయలు మన గ్రామము అనే గ్రూపు ద్వారా సేకరించారు. మృతురాలి మనుమరాలు చెక్క ఆద్య పేరిట కేవీపీ కింద రూ.29 వేలను డిపాజిట్ చేశారు. ఇవాళ‌ ఆ పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేశారు. గ్రామస్తులు తామంత అండగా ఉన్నామని, ముందుకు వచ్చి చేయూతనివ్వడం బాధిత కుటుంబానికి భరోసాను ఇచ్చింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply