Dandepally | విద్యార్థులకు బోదిస్తున్న ఉపాధ్యాయులు

Dandepally | విద్యార్థులకు బోదిస్తున్న ఉపాధ్యాయులు
ప్రయోగాలతోనే ఉత్తమ ఫలితాలు
Dandepally | దండేపల్లి, ఆంధ్రప్రభ : విద్యార్థులు సాధారణ బోధన తో పాటు ప్రయోగాలతో బోధిస్తే తో ఉత్తమమైన ఫలితాలు వస్తాయని దండేపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు సంఘర్స్ రాజేశ్వరరావు పేర్కొన్నారు. దండేపల్లి (Dandepally) ఉన్నత పాఠశాలలో సోమవారం దండేపల్లి లక్సెట్టిపేట, జన్నారం మండలాల భౌతిక రసాయన శాస్త్రం సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో ప్రయోగశాలలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి కృత్యాన్ని విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని సూచించారు.. ఈ సందర్భంగా దండేపల్లి లో ఏర్పడిన నూతన ప్రయోగశాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు అప్పల మనోహర్, పాత రమేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు .
