టీడీపీ, వైసీపీ బాహాబాహీ…

  • కర్రలు.. రాళ్లతో పరస్పర దాడులు
  • కోవెలకుంట్లలో ఉద్రిక్తత

నంద్యాల , ఆంధ్రప్రభ బ్యూరో : నంద్యాల జిల్లా కోయిలకుంట్ల మండలం కలగొట్ల గ్రామంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రగడ రగిలింది.టీడీపీ, వైసీపీ నాయకులు కర్రలు రాళ్లతో పరస్పర దాడులకు దిగారు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. దసరా పండుగ అనంతరం మాంసం కొనేందుకు గ్రామంలోకి వెళ్లిన తమ నాయకులపై దాడి జరిగినట్టు వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనలో వైసీపీ నాయకులు తీవ్రవంగా గాయపడ్డారు. బనగానపల్లె నియోజకవర్గంలో గతంలో రామ సుబ్బారెడ్డి పై దాడి ఘటన మరువక ముందే వైసీపీ నేతలపై దాడులు జరగటంతో నియోజకవర్గం లో అలజడి చెలరేగింది. రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తోంది.

కోవెలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు బ్రహ్మం,సుధాకర్ రెడ్డి,గుర్రప్ప,శ్రీను మొత్తం ఆరుగురిపై రాడ్లతో, కట్టెలతో కోబలి నరబలి అంటూ మంత్రి అనుచరులు దాడి చేశారంటూ వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.అడ్డు వచ్చిన మహిళలపై కూడా దాడి చేసిన రౌడీషీటర్ టీడీపీ నాయకుడు అర్జున్ , టీడీపీ అనుచరులు ఉన్నారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆరోపిస్తున్నారు.

తీవ్రగాయాలతో కోవెలకుంట్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ నాయకులు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా సరిగ్గా స్పందించటం లేదని ఆరోపించారు. కోయిలకుంట్ల ప్రభుత్వాసుపత్రి పెళ్లి బాధితులను పరామర్శించారు.

గ్రామంలో ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠతో గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. సర్పంచ్ ఎన్నికలు దగ్గర వస్తుండడంతో గ్రామాల్లో మంత్రి ప్రోద్బలంతో భయభ్రాంతులకు గురిచేస్తున్న రని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. దాడులు ఇలాగే కొనసాగితే మాత్రం సహించేది లేదన్నారు. తమ పట్ల టీడీపీ నాయకులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వైసీపీ మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ స్థితిలో కలగొట్ల గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Leave a Reply