ఘనంగా స్వయం పాలనదినోత్సవ వేడుకలు….

ఘనంగా స్వయం పాలనదినోత్సవ వేడుకలు….
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థులు వివిధ వేషాధారణలో తోటి విద్యార్థులకు పాఠాలు బోధించి స్వయం పరిపాలన దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. స్వయం పరిపాలన దినోత్సవవేడుకలను పురస్కరించుకొని వివిధ పార్టీల నాయకులు విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాలలను సందర్శించి విద్యార్థుల బోధన తీరును పరిశీలించి అభినందించారు.
కలెక్టర్ గా షారూఖ్ అన్సార్, జిల్లా విద్యాశాఖ అధికారిగా మహమ్మద్ సుఫియాన్, ప్రధానోపాధ్యాయులుగా ఉమ్మె సిధీఖ, బజేబ ఖానం పలువురు విద్యార్థులు వివిధ పాత్రలో విద్యార్థులు ఆద్యంతం ఆసక్తికరంగా తమ పాత్రలు చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ సలాం మాట్లాడుతూ స్వయం పరిపాలన దినోత్సవంవిద్యార్థులులో పాఠశాల పైన అవగాహన కల్పించడమే కాకుండా వారికి ఉపాధ్యాయ వృతి పైన గౌరవం, ఆసక్తి ల్పించబడుతుందని, భవిష్యత్తులో వారు ఉపాధ్యాయులు కావాలి అనే జిజ్ఞాస పెంపొందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీ ఆర్ పీ భీమన, ఉపాధ్యాయులు మీర్ లియకత్,జరీన బేగం, జహూర్ఉదిన్, తదితరులు పాల్గొన్నారు.
