students | విద్యార్థుల కు ప్యాడ్ పెన్నులు అందజేత.

students | విద్యార్థుల కు ప్యాడ్ పెన్నులు అందజేత.
students | దండేపల్లి, ఆంద్రప్రభ : దండేపల్లి మండలంలోని తాల్లపేట గ్రామానికి చెందిన ఆర్యవైశ్య సంఘం నాయకులు గౌరిశెట్టి శ్రీనివాస్ 45వ, జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం తాల్లపేట జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విధ్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు పరీక్షల సమయం దగ్గర పడుతుండడంతో బాగా చదవాలని కష్టపడి ఇష్టంతో చదువుతే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు.
అనంతరం విద్యార్థుల కు ప్యాడ్లు పెన్నులు అందజేశారు. ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్ పుట్టపాక తిరుపతి, ప్రధానోపాధ్యాయులు సుదర్శన్ ఆర్యవైశ్య సంఘం నాయకులు కటుకం శ్రీనివాస్, మల్యాల రమణయ్య, మల్యాల శ్రీనివాస్, కటుకం రాజేందర్, శ్రీనివాస్, కిష్టయ్య, అక్కినపెల్లి రమేష్, గునిశెట్టి చంద్రశేఖర్, శివ, యెలుగూరి వెంకటేష్, అనిల్, కొత్త రవి ఉపాధ్యాయులు విధ్యార్థులు పాల్గొన్నారు.
