Street Dogs | బాలికను ఘోరంగా కరిచిన కుక్కలు.

Street Dogs | బాలికను ఘోరంగా కరిచిన కుక్కలు.

  • బాలికనుపాలమూరుఆస్పత్రికి తరలింపు…

Street Dogs | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో వీధి కుక్కలు(stray dogs) మరోసారి విజృంభించాయి. కుక్కలు రోజుకు ఎక్కడో ఒకచోట మనుషులు, పశువులపై దాడి చేసి గాయపరుస్తున్నా అధికారులు(officials) పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఊట్కూర్ మండల కేంద్రంలో ఈ రోజు సాయంత్రం గాంధీనగర్ వీధికి చెందిన బుడపోల అక్షితపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా కుక్కలు మూకుమ్మడిగా దాడి చేయడంతో బాలిక దవడ నోటి భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం ఊట్కూర్ ప్రభుత్వాస్పత్రి(Government Hospital)కి తరలించగా అక్కడ ప్రథమ చికిత్సలు నిర్వహించి నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా గాయాలు తీవ్రంగా ఉండడంతో అక్కడి వైద్యుల సూచనలు మేరకు మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుక్కల దాడి నుండి ప్రజలను, పశువులను కాపాడాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.

Leave a Reply