Seethakka | పిల్లలకు పాల పంపిణీ

పైలెట్ ప్రాజెక్టు ప్రారంభం

seethakka | ఆంధ్రప్రభ, ములుగు ప్రతినిధి : ఉమ్మడి వరంగల్ పరిధిలోని ములుగు జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు (pilot project) గా అంగన్‌వాడీ కేంద్రాల్లో 3 నుంచి 6 సంవత్సరాల ప్రీస్కూల్ పిల్లలకు ప్రతిరోజూ 100 మి.లీ. పాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు.

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) (minister seethakka), జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్., ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సి.హెచ్. మహేందర్ జీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డితో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కార్యక్రమంలో డీడబ్ల్యూవో తుల రవి, సీడీపీవో శిరీష, అంగన్‌వాడీ టీచర్లు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, ప్రీస్కూల్ పిల్లలు పాల్గొన్నారు.

Leave a Reply