School | పిల్లల ఆహారం దోపిడీ..

School | పిల్లల ఆహారం దోపిడీ..

School | గుడివాడ, ఆంధ్రప్రభ : గురుకుల పాఠశాలలో పేద విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని కొందరు దందాగా మార్చుకుంటున్నారు. విద్యార్థులకు పెట్టాల్సిన గుడ్లు, మాంసాన్ని పాఠశాల సెక్యూరిటీ సిబ్బంది బయట మార్కెట్‌లో అమ్ముకుంటున్నారనే తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పిల్లలు సరైన ఆహారం లేక పోషక లోపాలతో బాధపడుతున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాకుండా అధికారులు పై నిధుల దుర్వినియోగం, పిల్లల ఆరోగ్యం పై జరుగుతున్న నేరంగా భావించాల్సిన అంశమని స్థానికులు అంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టి, బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోకపోతే ఉద్యమం చేపడతామని విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply