Schemes | పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ గౌరవం, గుర్తింపు…

Schemes | పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ గౌరవం, గుర్తింపు…
- వర్దన్నపేట ఎమ్మెల్యే నాగరాజు
Schemes | హసన్ పర్తి, ఆంధ్రప్రభ : అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ గౌరవం, గుర్తింపు నిస్తామని వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు(MLA KR Nagaraju) హమీ ఇచ్చారు. హన్మకొండ జిల్లా హసన్ పర్తికి చెందిన 50 మందీ నాయి బ్రాహ్మణులు ఎమ్మెల్యే సమక్షంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 66వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కనపర్తి కిరణ్, స్థానిక కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.
అనంతరం వారిని ఎమ్మెల్యే సన్మానించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ–అభివృద్ధి పథకాలు(schemes) ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకొస్తున్నాయని పేర్కొన్నారు. నాయకుడు సేవకుడిలా పనిచేసినప్పుడే ప్రజల నమ్మకం పెరుగుతుందని, అదే నమ్మకంతో ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్నారని వివరించారు.
నాయి బ్రాహ్మణ సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా నిలిచిందని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో తాము భాగస్వాములమని తెలిపారు. ఈమేరకు పార్టీలో చేరిన వారిలో వీసం రవీందర్ రెడ్డి, ఎస్టి శ్రీనివాస్, వీరస్వామి, శ్రీనివాస్ సాంబశివరాజు రవి కుమార్, శ్రవణ్, రమేష్, సాయి, వెంకటేష్, నాగరాజు, క్రాంతి, అనిల్, జన్ను సునీల్, మేర సతీష్, నగేష్, జనగాన వెంగళ రాంబాబు, తాళ్లపెళ్లి, సదానందం తో పాటు తదితరులను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎర్రగట్టుగుట్ట దేవస్థాన చైర్మన్ వెంకటస్వామి, మాజీ జెడ్పిటీలు వెంకన్న, ప్రభాకర్, మండల సోషల్ మీడియా బిగుళ్ళ సురేష్, సీనియర్ నాయకులు మేకల ఆనంద్, పుల్ల రవీందర్, వీసం సురేందర్ రెడ్డి, నరసింహరాములు, శ్రీనివాస్, రాజు, అశోక్ లు పాల్గొన్నారు…
