Sangambanda | గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

Sangambanda | గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
Sangambanda | మక్తల్, ఆంధ్రప్రభ : సర్పంచిగా సంగంబండ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని నూతన సర్పంచ్ గా భాద్యతలు చేపట్టిన సర్పంచ్ గవినోళ్ళ సుమిత్రమ్మ అన్నారు. ఈ రోజు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ గా గవినోళ్ళ సుమిత్రమ్మ, ఉప సర్పంచ్ గా సురేష్ తోపాటు వార్డు సభ్యుల చేత స్పెషల్ ఆఫీసర్ ఎంపిడిఓ రమేష్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సంగంబండ గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తారని అన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరితో కలిసి గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు.
రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేలా చూస్తానన్నారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పూర్తి చేసి గ్రామాన్ని జిల్లాలో ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని సర్పంచ్ గవినోళ్ళ సుమిత్రమ్మ అన్నారు. గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు తనతో కలిసి రావలసిందిగా ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పలువు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శారద కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
