హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి గా సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నుంచి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా కె. రామకృష్ణారావు కొనసాగుతుండగా.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రిటైర్మెంట్ అయ్యారు.
ఆమె స్థానంలో కె. రామకృష్ణారావు సీఎస్‌గా నియమితులవడంతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్థానం ఖాళీ అయ్యింది. దీనితో తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ పదవిలోకి సందీప్ కుమార్ సుల్తానియాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. కాగా ఆర్థిక కార్యదర్శిగా నియమితులైన సందీప్ కుమార్ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కను మర్యాద పూర్వకంగా కలిశారు..