సమ్మక్క, సారలమ్మరేవంత్ ప్రత్యేక పూజలు

సమ్మక్క, సారలమ్మరేవంత్ ప్రత్యేక పూజలు
ఉమ్మడి వరంగల్ బ్యూరో, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) మేడారం చేరుకున్నారు. ఈ రోజు మేడారం జాతర ఏర్పాట్లను నేరుగా పరిశీలించేందుకు ఈ రోజు ఆయన పర్యటించనున్నట్లు తెలిసిందే. హైదరాబాద్ నుంచి నేరుగా మేడారం హెలికాప్టర్‌లో(a helicopter) చేరుకున్నారు.
అక్కడ నుంచి సమక్క, సారలమ్మ(Samakka, Saralamma) గద్దె దగ్గరకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. సీఎంతోపాటు రాష్ట్ర రెవెన్యూ(State Revenue), సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు.

