తాగునీటి సరఫరా పునరుద్ధరణ

తాగునీటి సరఫరా పునరుద్ధరణ
అచ్చంపేట, ఆంధ్రప్రభ : తుఫాన్ ప్రభావంతో ఏకధాటిగా కురిసిన వర్షాలకు వచ్చిన వరద ఉద్ధృతికి నక్కలగండి ప్రాజెక్ట్ లో జలదిగ్బంధంలో ముంపుకు గురైన మార్లపాడు తండాలో ఆర్డబ్ల్యుఎస్ డిఈఈ హేమలత(RWS DEE Hemalatha) తన సిబ్బందితో అహర్నిశలు శ్రమించి త్రాగునీటి సరఫరాను పునరుద్ధరించారు.
వరద ఉధృతితో మర్లపాడు తండ గ్రామము పూర్తిగా జలమయమై మిషన్ భగీరథ పైప్లైన్, త్రీఫేస్, సింగిల్ ఫేస్ మోటార్లు కాలిపోవడంతో మర్లపాడు తండా గ్రామానికి తాగునీటి సరఫరా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో గ్రామస్తులకు డిఈఈ హేమలత ముందస్తుగా మినరల్ వాటర్(Mineral Water)ను సరఫరా చేసి వారి దాహర్తిని తీర్చారు.
తధానంతరం త్రీఫేస్, సింగిల్ ఫేస్ మోటార్లను మరమ్మతు చేయించి, మిషన్ భగీరథ పైపులను సవరించి గ్రామస్తులకు తాగునీటి సరఫరా లో ఇబ్బందులు సవ్యంగా తరపున అయ్యేలా చర్యలు తీసుకున్నారు. గ్రామస్తుల దాహార్తిని తీర్చేందుకు డీఈఈ హేమలత కృషిని పలువురు అభినందిస్తున్నారు.

