Records | శాఖపరమైన సమస్యలపై తక్షణమే స్పందించాలి

Records | శాఖపరమైన సమస్యలపై తక్షణమే స్పందించాలి

  • అధికారులు ఆలస్యం చేయొద్దు
  • పరిపాలన విభాగం చొరవను చూపాలి
  • సమస్యలుంటే తన దృష్టికి తీసుకురండి
  • వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌

Records | వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : పోలీస్‌ అధికారులు, సిబ్బందికి సంబంధించిన శాఖపరమైన సమస్యలపై పరిపాలన విభాగం సిబ్బంది తక్షణమే స్పందించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్(Commissioner Sunpreet Singh) ఆదేశించారు. విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొనే పోలీస్ ఆఫీసర్స్ సమస్యల పరిష్కారంలో జాప్యం చేయొద్దన్నారు.

కుంటిసాకులతో అనవసర తాత్సారం చేయకుండా అభ్యంతరాలు, అనుమానాలుంటే తక్షణమే నివృత్తి చేసుకొని సమస్యలకు పరిష్కారం చూపాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీతి సింగ్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్ ఈ రోజు పరిపాలన విభాగం కార్యాలయములో తనిఖీలు చేపట్టారు. తనిఖీలు పోలీస్ కమీషనరేట్ కార్యాలయమునకు చేరుకున్న కొత్వాల్ కు అధికారులు(officials) పుష్పాగుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు.

అనంతరం సాయుధ పోలీసులు గౌరవ వందనం చేసారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ పరిపాలన విభాగం కార్యాలయములోని బడ్జెట్‌, ఎస్టాబ్లిష్‌మెంట్‌, పే వింగ్, జనరల్‌ సెక్షన్లతో పాటు యం.ఎస్‌ సెక్షన్లు, ఇన్‌వర్డ్‌, ఆవుట్‌ వర్డ్‌లను పోలీస్‌ కమిషనర్‌ సందర్శించారు. సంబంధిత సెక్షన్‌ అధికారులు నిర్వహిస్తున్న విధులు అలాగే అ సెక్షన్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది విధులకు సంబంధించిన పలు రికార్డులను పోలీస్‌ కమిషనర్‌ తనిఖీలు చేసారు.

Records |

ముఖ్యంగా సిబ్బందికి సంబంధించి శాఖపరమైన సమస్యలపై వచ్చిన దరఖాస్తులపై సంబందిత సెక్షన్‌ అధికారులు తీసుకుంటున్న చర్యల వివరాలకు చెందిన రికార్డుల(Records)ను పరిశీలించారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ పరిపాలన విభాగం సజావుగా కోనసాగేందుకు సంబంధిత అధికారులకు పలుసూచనలు అందజేశారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ అధికారుల మధ్య ఏలాంటి అలస్యం లేకుండా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి,సమస్యలను పరిష్కారించాలన్నారు.

Records |

పరిపాలన పరంగా ఎలాంటి సమస్యలు వచ్చిన తన దృష్టికి తీసుకరావాలని పోలీస్‌ కమిషనర్‌ తెలియజేసారు. ఈ తనిఖీల్లో అదనపు డిసిపి రవి, పరిపాలన విభాగం ఏ.ఓ సంపత్‌,సెక్షన్‌ సూపరింటెండెంట్లు రమేష్‌,యాకూబ్‌ బాబా, సంధ్య, జలజ,రమాదేవి,సురేందర్‌ లతో పాటు ఇతర పరిపాలన సిబ్బంది పాల్గోన్నారు.

Records |
Records |
Records |
Records |
Records |

Leave a Reply