3వ వార్డులో మూడు నెలల రేషన్ పంపిణీ…

3వ వార్డులో మూడు నెలల రేషన్ పంపిణీ…

  • ప్రారంభించిన కౌన్సిలర్ బెడ్డల సౌజన్య-విజయ్ కుమార్

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణంలోని 3వ వార్డులో మూడు నెలల కోటా రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం కౌన్సిలర్ బెడ్డల సౌజన్య-విజయ్ కుమార్ ప్రారంభించారు. అర్హులైన లబ్ధిదారులకు బియ్యాన్ని అందజేస్తూ పంపిణీ ప్రక్రియను ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరేలా చూడటమే తమ బాధ్యత అని పేర్కొన్నారు.

రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా, పారదర్శకంగా లబ్ధిదారులకు అందజేయాలని ఈ సందర్భంగా ఆమె డీలర్‌ను ఆదేశించారు. మూడు నెలల రేషన్ ఒకేసారి అందడం పట్ల వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాలకు ఇది ఎంతో ఊరటనిస్తుందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్, స్థానిక నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a Reply