Random check | పాఠశాలను సందర్శించిన విద్యాధికారి..

Random check | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఈ రోజు జిల్లా విద్యాధికారి యాదయ్య సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు వారికి సరైన భోజనం పెట్టుతలేరని తమకు చెప్పుకోవడతో మధ్యాహ్న బోజనాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

విద్యార్థులకు విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు, ప్రతి రోజు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందేలా చూడాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులకు, ఉపాధ్యాయులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి, మంత్రి రాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంఘర్శ రాజేశ్వర్ రావు, ఎంపిఓ ప్రసాద్, ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply