Puri jagannadh | స్లమ్ డాగ్ రిలీజ్ అవ్వదా..?

Puri jagannadh | స్లమ్ డాగ్ రిలీజ్ అవ్వదా..?

Puri jagannadh | పూరి జగన్నాథ్ సినిమాలకు బ్యాన్ వార్తలు.. అసలు కారణం ఏంటి?
డబుల్ ఇస్మార్ట్, లైగర్ నష్టాలు బయ్యర్ల ఆగ్రహానికి కారణం
పోకిరి రీ రిలీజ్ కూడా ఆగిపోతుందా?
బయ్యర్లతో వివాదం.. స్లమ్ డాగ్ రిలీజ్‌పై అనిశ్చితి
పూరి జగన్నాథ్ ముందున్న పెద్ద సవాల్

Puri jagannadh | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. సినిమాలను ఎంత స్పీడుగా తీస్తాడో తెలిసిందే. ఎంత పెద్ద స్టార్ హీరోతో అయినా.. చాలా తక్కువ టైమ్ లోనే సినిమాలు కంప్లీట్ చేయడం పూరి స్టైల్. అయితే.. కోలీవుడ్ స్టార్ (Kollywood Star) విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ సినిమాని చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేశాడు కానీ.. ఇంత వరుకు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే.. పూరి సినిమాలు బ్యాన్ చేసారని వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది..? ఎందుకు.. పూరి సినిమాలు బ్యాన్ చేయాలి అనుకుంటున్నారు..?

Puri jagannadh | డబుల్ ఇస్మార్ట్, లైగర్ చిత్రాల వలనే..

పూరి జగన్నాథ్ తెరకెక్కించిన డబుల్ ఇస్మార్ట్, లైగర్ సినిమాలు వలన బయ్యర్లకు భారీగా నష్టాలు వచ్చాయి. అయితే.. నష్టపరిహారం అడిగిన బయ్యర్లకు డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మిల నుంచి సరైన హామీ లభించలేదట. దీంతో వెంనటే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ (Demand) చేస్తున్నారు. నైజాం పంపిణీదారుడైన సునీల్ నారంగ్ నాయకత్వంలో ఫిలిం ఛాంబర్ ద్వారా దీనికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. సునీల్ నారంగ్ కు కూడా లైగర్ బకాయిలు రావాల్సివుంది. అందుకనే.. బయ్యర్లు అందరూ కలిసి పూరి జగన్నాథ్ సినిమాలను బ్యాన్ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

Puri jagannadh

Puri jagannadh | పోకిరి రీ రిలీజ్ కూడా లేనట్టే..

పూరి జగన్నాథ్ తెరకెక్కించిన పోకిరి సినిమాని మహేష్‌ బాబు అభిమానులు మే నెలలో రీ రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. ఈ మూవీ రైట్స్ పూరి జగన్నాథ్ దగ్గర ఉండడంతో.. అమెరికాకు (America) చెందిన కొందరు పూరికి ఫ్యాన్సీ రేటు ఇచ్చి థియేట్రికల్ రైట్స్ తీసుకున్నారట. అయితే.. బయ్యర్లు పూరి సినిమా కాబట్టి ఈ సినిమా రీ రిలీజ్ కి థియేటర్లు ఇవ్వమని చెప్పారట. దీంతో ఇప్పుడు మే నెలలో పోకిరి సినిమా కాకుండా అతిథి సినిమాను రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. దీనిని బట్టి బయ్యర్లు పూరి సినిమాల రిలీజ్ విషయంలో ఎంత పట్టుదలగా ఉన్నారో అర్ధం అవుతుంది.

Puri jagannadh

Puri jagannadh | స్లమ్ డాగ్ ఎప్పుడు..

వరుస ప్లాపుల్లో ఉన్న పూరి జగన్నాథ్ తో సినిమా (Movie) చేయడానికి తెలుగులో ఏ హీరో ముందుకు రాకపోవడంతో.. తమిళ హీరో విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ అనే డిఫరెంట్ స్టోరీతో సినిమా తీసారు. ఈ మూవీ అనుకున్న ప్లాన్ ప్రకారం.. షూటింగ్ కంప్లీట్ అయ్యింది కానీ.. ఇంత వరుకు ఎప్పుడు రిలీజ్ చేస్తారో క్లారిటీ లేదు. కారణం ఏంటంటే.. బయ్యర్లు థియేటర్స్ ఇవ్వమని.. తెగసి చెప్పడం వలనే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బయ్యర్లతో ఉన్న వివాదాన్ని పరిష్కరించుకోవాలి. మరి.. పూరి ఏం చేస్తాడో..? ఎలా ఈ కష్టాల నుంచి బయటపడతాడో..? స్లమ్ డాగ్ మూవీతో ఎంత వరుకు మెప్పిస్తాడో చూడాలి.

Puri jagannadh

Leave a Reply