public path | విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకే ప్రజాబాట

public path | పాలకుర్తి, ఆంధ్రప్రభ : విద్యుత్ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకే ప్రజా బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు పాలకుర్తి మండలం విద్యుత్ శాఖ అధికారి ఏఈ ప్రసాద్ స్పష్టం చేశారు. మంగళవారం జీడీ నగర్ లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో పలు వీధుల్లో ఆయన పర్యటించారు. ఆయా కాలనీవాసులను విద్యుత్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ సూర రమ మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో ఉన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ విన్నూతనంగా ప్రజా బాట కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఉప సర్పంచ్ ఉదయ్, సబ్ ఇంజనీర్ రాజు కుమార్, లైన్ ఇన్ స్పెక్టర్ కిరణ్, లైన్ మెన్ లక్ష్మణ్, మోతిలాల్, కార్యదర్శి సంజీవ్, వార్డు సభ్యులు నిర్మలా, వైష్ణవి, స్వరూప, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply