సంతృప్తికరమైన సేవలు అందించండి
- విధినిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదు
- జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్
పాడేరు (ఏఎస్ఆర్ జిల్లా), సెప్టెంబర్ 23: మ్యూటేషన్ల పనులు వేగవంతం చేయాలని, సంతృప్తికరమైన సేవలు అందించి, పిజిఆర్ఎస్ ఫీడ్ బ్యాక్ పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఎ.ఎస్ దినేష్ కుమార్ (Collector A.S. Dinesh Kumar) అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఐ.టి.డి.ఎ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీపూజ, సబ్ కలెక్టర్లు, 22 మండలాల రెవెన్యూ అధికారులతో రేషన్ కార్డు సర్వీసెస్, రెవెన్యూ సదస్సులు, హౌసింగ్, పిబిఎస్ఎల్ఎ సర్వీసెస్, ఏపీ సేవాపోర్టల్, క్యాస్ట్ సుమోటో డ్రైవ్, రెవెన్యూ తదితర అంశాలపై కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.
నేటికీ పెండింగ్ లో ఉన్న మ్యూటేషన్ పనులపై మండలాల వారీగా రివ్యూ చేపట్టారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ… మ్యూటేషన్ల ప్రక్రియ (mutations process) వేగవంతం చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న మ్యూటేషన్లకు సంబందించి ప్రణాళికలు రూపొందించి త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. అలాగే రీసర్వే పురోగతిపై ఆరా తీశారు. ప్రణాళికలు వేసుకొని పనుల పురోగతికి చర్యలు చేపట్టాలన్నారు. అటవీ, రెవెన్యూ కి సంబంధించిన భూముల రీ రీసర్వే కోసం ఒక కమిటీ వేయాలన్నారు.
అనంతరం పిజిఆర్ఎస్ నిర్వహణ పై కలెక్టర్ మాట్లాడుతూ… లాప్సెస్ పై మండలాల వారీగా సమీక్షించి పనుల వేగవంతం చేయాలన్నారు. చౌకధర దుకాణల పరిశీలన కార్యక్రమంపై ఆరాతీశారు. అలాగే ఇంటి స్థలం కావాలని దరఖాస్తూ చేసుకున్న వారి వివరాలపై ఆరాతీసి, నేటికీ ఇంటి స్థలం మంజూరు కాకపోవడానికి కారణాలపై, పనుల పురోగతిపై ఆసహనం వ్యక్తం చేశారు. నెల రోజుల్లోగా అర్హులను గుర్తించి ఇంటి స్థలం మంజూరు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు పరిరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ భూములు (Government lands) కబ్జాకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇళ్ల పట్టాలు లేని వారికీ పట్టాలు అందించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. పనులు పురోగతి కావాలంటే అధికారులు గ్రామాల్లో పర్యటించాలన్నారు.
ఏపీ సేవాపోర్టల్ (AP Service Portal) లో పెండింగ్ లో ఉన్న దరఖాస్థులపై ఆరా తీశారు. సమస్యల పరిష్కారానికి ఫీడ్ బ్యాక్ కీలకమని, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. నాణ్యతతో కూడిన పరిష్కారం అందించాలనే లక్షంతో విధులు నిర్వహించాలన్నారు. పౌర సరఫరాల పెండింగ్ లో ఉన్న ధరఖాస్తుల పరిశీలన కార్యక్రమం వేగవంతం చేయాలని, పెండింగ్ లో వున్న ప్రతీ దరఖాస్తు గ్రామస్థాయిలో పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. కొత్త రేషన్ కార్డుల మంజూరుపై సమీక్షించారు.
ప్రస్తుతానికి పెండింగ్ లో ఉన్న పిటిషన్ లు రానున్న వారం రోజుల్లో పరిష్కరించాలన్నారు. మండల స్థాయిలో అన్ని పిజిఆర్ఎస్ గ్రీవెన్స్ (PGRS Grievance) లను పరిష్కరించే విధానాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ప్రత్యేకంగా నియమించిన సిబ్బందితో ఆడిట్ చేయించి సమస్య పరిష్కారంలో ఏమైనా లోపాలు కనిపించినా, సరిగా పర్యవేక్షిoచకుండా గ్రీవెన్స్ ముగించినా, అర్జీదారునితో సంబంధిత గ్రీవెన్స్ రెడ్రెస్సెల్ అధికారి మాట్లాడకపోయినా సంబంధిత అధికారిపై చర్యలు తప్పవని కలెక్టర్ తెలిపారు. పిజిఆర్ఎన్, రెవెన్యూ సమస్యలు పరిష్కారానికి తాహశీల్దార్లు చొరవ చూపించాలన్నారు. ప్రతీ వారం సమస్యలు పరిష్కారానికి క్షేత్రస్థాయి సిబ్బందితో రివ్యూ చేయాలని సూచించారు. మూడు డివిజన్లలోని సబ్ కలెక్టర్లు సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు.
ప్రభుత్వ శాఖలకు ఏవైనా భూములు అప్పగించినట్లయితే ఆ భూములు ప్రభుత్వ శాఖల అధీనంలో లేకుండా వేరే ఎవరి అన్యాక్రాంతంలో ఉన్నట్లు ఐతే గత మూడు సంవత్సరాలకు సంబంధించిన హ్యాండ్ ఓవర్ చేసిన భూములు వివరాలు క్షేత్ర స్థాయిలో నిశితంగా పరిశీలించి నివేదికలు పంపించమని తహసీల్దార్లకు ఆదేశించడం జరిగింది. ఈ వీడియో కాన్ఫరెన్సు (Video conference) లో డిఆర్ఓ కె. పద్మలత, ప్రత్యేక ఉప కలెక్టర్, పిజిఆర్ఎస్ నోడల్ ఆఫీసర్ ఎం.వి.ఎస్ లోకేశ్వర రావు, వర్చువల్గా రంపచోడవరం సబ్ కలెక్టర్, 22 మండలాల తహశీల్దారులు, సర్వేయర్స్ మండల సర్వేర్లు, విఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు.

