protests | ఆ పథకాన్ని యధావిధిగా అమలుచేయాలి

protests | ఆ పథకాన్ని యధావిధిగా అమలుచేయాలి

  • గ్రామాల్లో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ నిరసనలు

protests | జైనూర్, ఆంధ్రప్రభ : నిరుపేద కూలీలకు ఉపాధి కల్పించాలని లక్ష్యంతో గత కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి నూతనంగా ప్రవేశపెట్టిన వీబీజీ రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసనలు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో కొనసాగుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అబ్దుల్ ముఖిద్ ఆధ్వర్యంలో సర్పంచులు, నాయకులు, పంచాయతీల వారీగా నూతన పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ప్రజలకు, ఉపాధి హామీ కూలీలకు జరుగుతున్న అన్యాయాలపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కూలీల కోసం ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్నారు.

protests

ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు పోచ్చం లొద్ది, మార్లవాయి గ్రామపంచాయతీల్లో కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యుల‌తో పాటు ఆయా పంచాయతీల సర్పంచులు మెస్రం మనోహర్, కనక ప్రతిభ, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తూ అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు పంచాయతీ చట్టాలకు అన్యాయం జరగకుండా వెంటనే నూతనంగా ప్రవేశపెట్టిన వీబీజీ రామ్ జీ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply