శ్రీ సత్యసాయి బ్యూరో, ఆగస్టు 15 (ఆంధ్రప్రభ) : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం (Dharmavaram) నియోజకవర్గం ముదిగుబ్బ సర్కిల్ పరిధిలోని పట్నం ఎస్.ఐ రాజశేఖర్ (S.I. Rajasekhar) ను పోలీస్ శాఖ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా (Sri Sathya Sai District) ఎస్పీ వి.రత్న ఉత్తర్వులు జారీ చేశారు.
న్యాయం కోసం పట్నం పోలీస్ స్టేషన్ (Patnam Police Station) కు వచ్చిన ఓ బాధిత మహిళను లైంగికంగా వేధించిన ఫలితంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో పోలీస్ అధికారుల (Police officers) చొరవను జిల్లా ప్రజలు ప్రశంసిస్తున్నారు. ప్రధానంగా ఎస్ఐ రాజశేఖర్ మహిళా పట్ల వ్యవహరించిన తీరుపై స్పందించిన జిల్లా ఎస్పీ వి.రత్న ముందుగా ఎస్సైని వీఆర్ (VR) కు పంపుతూ ఆదేశాలు ఇచ్చారు. అనంతరం శాఖాపరంగా విచారణ జరిపి, విచారణలో ఎస్సై మహిళా పట్ల వ్యవహరించిన తీరు వాస్తవమని తేలడంతో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఎస్సైని సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తరాలు జారీ చేయడం జరిగింది.