15వ వార్డు సమస్యలు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తా..

15వ వార్డు సమస్యలు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తా..
- బీఆర్ఎస్ అభ్యర్థి కందుకూరి వేణుగోపాల మూర్తి
పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పురపాలక సంఘం 15వ వార్డులోని సమస్యలను శాశ్వత పరిష్కారాన్ని కృషి చేస్తానని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కందుకూరి వేణుగోపాల మూర్తి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ రోజు పరకాల పురపాలక సంఘం 15వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కందుకూరి వేణుగోపాల మూర్తి ఇంటింటి తిరిగి ప్రచారం నిర్వహించారు.
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆశీస్సులతో 15వ వార్డు లోని ఓటర్ల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 15వ వార్డు లోని ఓటర్లు ఆశీర్వదించి బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. అభ్యర్థి కందుకూరి వేణుగోపాల మూర్తి వెంట స్వర్ణకార సంఘం నాయకులు శంకరాచారి, గుగ్గిళ్ళ రాజు, వి కోటేశ్వర్, శివారపు రాజు, వార్డ్ నాయకులు మహమ్మద్ ఆజ్మీయా తదితరులు ఉన్నారు.
