Parakala | 15వ వార్డులో ఇంటింటి ప్రచారం..

Parakala | 15వ వార్డులో ఇంటింటి ప్రచారం..
Parakala | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పురపాలక సంఘం 15వ వార్డులో బీజేపీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బిజెపి 15వ వార్డు అభ్యర్థి కుక్కల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు పరకాల మున్సిపాలిటీ 15వ వార్డులో ఓటర్లను కలిసి బీజేపీని గెలిపించాలని అభ్యర్థించారు. 15వ వార్డులోని ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ కాళీ ప్రసాద్ రావు ఆశీస్సులతో 15వ వార్డులో విజయం సాధించడం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థి కుక్కల విజయకుమార్ మాట్లాడుతూ… తనపై నమ్మకం ఉంచి ఓటర్లు ఆశీర్వదిస్తే, వార్డులోని ప్రతి సమస్యను పరిష్కరించి అభివృద్ధికి కృషి చేస్తానని ఓటర్లకు తెలియజేశారు. అభ్యర్థి వెంట బిజెపి వార్డు నాయకులు ఉన్నారు.
