ప్రమాదంలో గాయపడిన టీడీపీ నేతకు పరామర్శ..

ప్రమాదంలో గాయపడిన టీడీపీ నేతకు పరామర్శ..

శ్రీరామ్ కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పిన నెట్టెం రఘురాం
జగ్గయ్యపేటలో ఇంటికి వెళ్లి పరామర్శ…
ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న మాజీ మంత్రి
త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన నాయకులు

జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మాజీ మున్సిపల్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు శ్రీరామ్ సుబ్బారావును కేడీసీసీ చైర్మన్, మాజీ మంత్రి నెట్టెం రఘురాం పరామర్శించారు. జగ్గయ్యపేటలోని వారి కార్యాలయంలో సుబ్బారావు గారిని కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ ప్రమాదంలో గాయపడిన సుబ్బారావు భార్య శ్రీరామ్ సునీత వారి కుమార్తె ఆరోగ్య పరిస్థితిపై కూడా విచారణ చేశారు. కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సుబ్బారావుకి ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో మేక వెంకటేశ్వర్లు, తాళ్లూరి వెంకటేశ్వర్లు, షేక్ అన్వర్, పున్న ఉపేంద్ర, సుధాకర్, తుమ్మల వెంకట చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply