TG | రేపు నాగార్జునసాగర్ కు అందాలభామ‌లు !

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ – 2025 పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పటికే అట్టహాసంగా ప్రారంభమైన ఈ అంతర్జాతీయ అందాల పోటీ 72వ ఎడిషన్‌లో 110కి పైగా దేశాల నుండి అందగత్తెలు మిస్ యూనివర్స్ కిరీటం కోసం పోటీ పడుతున్నారు.భారతదేశం తరపున మిస్ ఇండియా నందిని గుప్తా పోటీ పడుతోంది.

ఇదిలా ఉండగా, అందాల భామలు బృందాలుగా ఏర్పడి తెలంగాణలోని చారిత్రక ప్రదేశాలు, ప్రసిద్ధ దేవాలయాలను సందర్శిస్తారు. ఈ క్రమంలో వారు రేపు (మే 12) నాగార్జునసాగర్‌లోని బుద్ధ పార్కును సందర్శించనున్నారు.

బుద్ద పూర్ణిమ కావడంతో బుద్ధుడికి పుష్పాంజలి ఘటిస్తారు. మహాస్థూపంపై ఉన్న విగ్రహాల గురించి వారికి ప్రముఖ బౌద్ధ విశ్లేషకుడు డాక్టర్ ఈమని శివనాగి రెడ్డి వారికి వివరిస్తారు. చివరగా మహాస్థూపం లోపల ధ్యానం చేసి ఐదు నిమిషాల పాటు మాంగ్స్‌ చాటింగ్‌లో పాల్గొంటారు. మహా స్తూపం నుంచి జాతక పార్కును సందర్శించి బుద్ధుడి చరిత్ర, తెలంగాణ బుద్ధిజం, బౌద్ధ విశేషాలు తెలుసుకుంటారు. బుద్ద వనంలో డిన్నర్‌లో పాల్గొని తిరిగి హైదరాబాద్‌ బయలుదేరుతారు.

దీంతో పోటీదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *