న్యాయం కోరుతూ బిజెడి రాష్ట్ర వ్యాప్తం ఆందోళనలు
అసెంబ్లీని ముట్టడించిన నిరసనకారులు
టియర్ గ్యాస్, వాటర్ పిరంగిలు ప్రయోగం
పలువురికి గాయాలు
భువనేశ్వర్ – .ఒడిశాలో (Odisha) విద్యార్థిని ఆత్మహత్యపై (suicide ) నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. కాలేజీ లెక్చరర్ వేధింపులకు తాళలేక 20 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా బుధవారం బీజేడీ (bjd) కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన (protest ) చేపట్టారు. ఇక భువనేశ్వర్‌లో అసెంబ్లీ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకారులు నిరసన చేపట్టారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అసెంబ్లీలోకి (assembly ) వెళ్లేందుకు ప్రయత్నించగా టియర్ గ్యాస్ (tean gas) , వాటర్ ఫిరంగి (water canon ) ప్రయోగించారు. దీంతో పలువురు గాయపడ్డారు. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక నిరసనలను జాతీయ రహదారిపై చేపట్టడంతో బాలసోర్ దగ్గర కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిపై భారీగా ట్రక్కులు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రొఫెసర్ లైంగిక వేధింపులు తాళ లేక ..
బాలాసోర్‌లోని ఫకీర్ మోహన్ (అటానమస్) కళాశాలకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ప్రొఫెసర్ లైంగిక వేధింపుల ఫిర్యాదును పట్టించుకోలేదని ఆరోపిస్తూ క్యాంపస్‌లో తనను తాను నిప్పంటించుకుంది. విద్యార్థిని జూలై 14న ఎయిమ్స్ భువనేశ్వర్‌లో 95 శాతం కాలిన గాయాలతో మరణించింది.
తనపై హెచ్‌వోడీ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు విద్యార్థిని పదే పదే ఫిర్యాదు చేసినప్పటికీ ప్రిన్సిపాల్ మరియు కళాశాల అధికారులు వాటిని పట్టించుకోకపోవడంతో మనస్తాపంతో నిప్పంటించుకుంది. ఈ సంఘటన ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. కాలేజ్ ఫ్రిన్సిపాల్ దిలీప్ ఘోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి విచారాన్ని వ్యక్తం చేశారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం, వైద్య బృందం అన్ని రకాల మద్దతు అందించినప్పటికీ, బాధితురాలిని ప్రాణాలతో కాపాడలేకపోయామని అన్నారు. ఈ కేసులో దోషులందరికి శిక్ష పడుతుందని, దీనిపై తాను వ్యక్తిగతంగా అధికారులకు సూచనలు జారీ చేశానని చెప్పారు. ప్రభుత్వం ఆమె కుటుంబానికి అండగా నిలుస్తుందని వెల్లడించారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

