Nizampeta | విద్యుత్ స్తంభాలు ఏర్పాటు..

Nizampeta | విద్యుత్ స్తంభాలు ఏర్పాటు..
Nizampeta | నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమలనాథ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయం నుండి చల్మెడ గ్రామం వరకు గ్రామ సర్పంచ్ బొమ్మన మల్లేశం వీధిలైట్లు వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలు జాతర సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో 16 విద్యుత్ స్తంభాల మంజూరు చేయగా ఆలయం నుండి గ్రామం వరకు వీధిలైట్లు వేయించామని తెలిపారు. దీనికి సహకరించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని విద్యుత్ ఏడి అదయ్య, ఏఈ గణేష్ లకు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ఆకుల మహేందర్, ఆలయ కమిటీ చైర్మన్ రాంరెడ్డి, డైరెక్టర్ బాజా రమేష్, ఎల్లాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
